ఆగస్టు 7న హైదరాబాద్లో అవార్డుల ప్రదానం
రామన్నపేట, ఆగస్టు 5 (నమస్తే న్యూస్): జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రదానం చేసే కొండ లక్ష్మణ్ బాపూజీ రాష్ట్రస్థాయి అవార్డులకు యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఏడుగురు చేనేత కళాకారులు ఎంపికయ్యారు.
జిల్లా నుంచి మొత్తం 20 మంది చేనేత కళాకారులు దరఖాస్తు చేసుకోగా, వారిలో ఏడుగురు అవార్డులకు ఎంపికైనట్లు చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు తెలిపారు. ఎంపికైన వారికి ఈ నెల ఆగస్టు 7న హైదరాబాద్లోని పీపుల్స్ ప్లాజాలో రాష్ట్రస్థాయి అవార్డులను అందజేయనున్నారు.
అవార్డులకు ఎంపికైన వారు:
- సీత సుధాకర్ (డిజైనర్) – పోచంపల్లి
- కర్నాటి పారిజాత (డిజైనర్) – కొయ్యలగూడెం
- గుర్రం బాలరాజు (వీవర్) – నారాయణపురం
- గుండు చంద్రకళ (వీవర్) – పుట్టపాక
- ఎదునూరి లక్ష్మయ్య (వీవర్) – గొల్లేపల్లి
- సంగిశెట్టి పద్మ (వీవర్) – వెల్లంకి
- రెబ్బ యాదగిరి (వీవర్) – చౌటుప్పల్
అవార్డులకు ఎంపికైన కళాకారులు నిర్ణీత సమయంలో హైదరాబాద్లోని కార్యక్రమానికి హాజరై అవార్డులను స్వీకరించాలని చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఒక ప్రకటనలో కోరారు.

