
తిరుమలాయపాలెం,జూలై 17(నమస్తే న్యూస్ )తిరుమలాయపాలెం మండల పరిధిలోని కాకరవాయి గ్రామం లో భూ రీ సర్వే పనులను ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ టీఎస్ క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సర్వే నిర్వహణ తీరును పరిశీలించి అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.గతంలో
జరిగిన తప్పిదాలు మళ్లీ పునరావృతం కాకుండా అత్యంత జాగ్రత్త గా వ్యవహరించాలని తహసిల్దార్ తో పాటు అధికారులను కలెక్టర్ హెచ్చరించారు. నిర్లక్ష్యం లేదా పొరపాట్లకు ఏమాత్రం అవకాశం ఉండకూడదని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన భూ రీ సర్వే కార్యక్రమం ప్రధాన ఉద్దేశం గత భూ సర్వేల్లో ఉన్న లోపాలు, తప్పిదాలను సరిచేసి రైతులకు శాశ్వత పరిష్కారం కల్పించడమేనని తెలిపారు. ప్రతి రైతుకు ఎలాంటి భూ వివాదాలు, సమస్యలు తలెత్తకుండా పూర్తి పారదర్శకంగా, ఆధునిక డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహించాలని అధికారులను కలెక్టర్. ఆదేశించారు రైతుల అభ్యంతరాలను వెంటనే పరిశీలించి న్యాయ బద్ధంగా పరిష్కరించాలని సూచించారు.భూ రికార్డులు ఖచ్చితంగా ఉండేలా అధికారులు సమన్వయంతో పనిచేసి, రైతులకు ఇబ్బందు లు కలగకుండా రీ సర్వే ప్రక్రియను గడువులో పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర్ ఆదేశించారు.కలెక్టర్ వెంట ఖమ్మం ఆర్డిఓ శ్రీనివాస్ రెడ్డి ,తిరుమలాయపాలెం తహసిల్దార్ లూథర్ విల్సన్ డిప్యూటీ తహసిల్దార్ సుధీర్ ఆర్ ఐ లక్ష్మణ్ పంచాయతీ కార్యదర్శి అంజయ్య గౌడ్ గ్రామ సర్పంచ్ గూడూరు ఉపేందర్ రైతులు కట్కూరి శ్రీనివాస్ రెడ్డి మోరపాక నాగయ్య కొలిశెట్టి బిక్షం తదితరులు పాల్గొన్నారు.

q
