- గ్రామీణ విద్యార్థుల విద్యాభివృద్ధికి వృత్తి విద్య అధ్యాపకుల చేయూత.
- పిండిప్రోలు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ.
తిరుమలాయపాలెం, జూలై 13 (నమస్తే న్యూస్)
గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులను అధిగమించి విద్యలో రాణించాలనే సదుద్దేశంతో ప్రభుత్వ జూనియర్ కళాశాల, పిండిప్రోలు వృత్తి విద్య అధ్యాపకులు సేవా స్ఫూర్తిని చాటుకున్నారు.కళాశాలలో చదువుతున్న ఒకేషనల్ విద్యార్థులకు అవసరమైన నోట్‌బుక్స్, పెన్నులను వృత్తి విద్య అధ్యాపకులు పాల్వాయి నారాయణరావు, చంద్రమౌళి, శ్రీనివాస్, పరుశురాం, శ్రీలత, ఉపేంద్ర చారి, వీరభద్రం, ఉపేందర్ తమ సొంత ఖర్చులతో సమకూర్చి విద్యార్థులకు పంపిణీ చేశారు.గ్రామీణ ప్రాంతాల నుంచి కళాశాలకు వచ్చే విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ చూపి, క్రమశిక్షణతో ఉన్నత లక్ష్యాలను సాధించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు అధ్యాపకులు తెలిపారు. విద్యార్థులకు అవసరమైన విద్యా సామగ్రిని అందించడం ద్వారా వారిలో చదువుపై ఆసక్తి, ఆత్మవిశ్వాసం పెంపొందించవచ్చని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. రామకృష్ణ గారు వృత్తి విద్య అధ్యాపకుల సేవా దృక్పథాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం అధ్యాపకులు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు. తన వంతుగా కూడా విద్యార్థులకు మరికొన్ని నోట్‌బుక్స్ అందజేస్తానని ప్రిన్సిపాల్ శ్రీ ఎస్. రామకృష్ణ గారు హామీ ఇచ్చారు.అధ్యాపకుల చేయూత పట్ల విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థుల విద్యాభివృద్ధికి కళాశాల సిబ్బంది చేస్తున్న కృషిని పలువురు అభినందించారు

