అమరుల లోటును నేటి యువత పూరించాలి:రాష్ట్ర అధికార ప్రతినిధి జేవి చలపతిరావు
అరుణోదయ ఉద్యమకారుల మృతి పీడిత ప్రజలకు తీరని లోటు:సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరు మధు
విప్లవ సాంస్కృతి కొద్యమ రథసారథి అరుణోదయ నాగన్న సంస్మరణ సభ
రిపోర్టర్:దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం,జూలై 13 (నమస్తే న్యూస్ )
సిపిఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జేవి చలపతిరావు అరుణోదయ సంస్కృతికొద్యమ రథసారథి సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు అరుణోదయ నాగన్న సంస్మరణ సభ సోమవారం రాజారంలో జరిగింది.సంస్మరణ సభ ప్రారంభానికి ముందు గ్రామంలో అరుణోదయ కళాకారులతో కోలాటం,డప్పు డాన్సులతో ప్రదర్శన జరిగింది.బొడ్రాయి సెంటర్లో శ్రీపాద శ్రీహరి విగ్రహానికి గాదె మాధవ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అరుణోదయ నాగన్న స్తూపాన్ని న్యూడెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి జేవి చలపతిరావు ఆవిష్కరించారు.
సిపిఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు మందుల రాజేంద్రప్రసాద్ అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా న్యూడెమోక్రసీ కేంద్ర నాయకులు మాధవరెడ్డి రాష్ట్ర అధికార ప్రతినిధి దేవి చలపతిరావు మాట్లాడుతూ నాగయ్య 50 ఏళ్లుగా విప్లవోద్యమంలో సాంస్కృతిక ఉద్యమ సారథిగా పార్టీ నాయకుడిగా ప్రజలకు నాయకత్వం వహించాడు అని అన్నారు.ఈ ప్రాంతంలో భూస్వాముల, పెత్తందారులు కు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో రాష్ట్ర అగ్ర నాయకులతో పాటు నాగన్న పాల్గొన్నారు.కానూరి తాత,అరుణోదయ రామారావు,నాగన్నలు విప్లవ గేయాలతో బుర్రకతలతో ఆంధ్ర లోకాన్ని తెలుగు ప్రజలను చైతన్య పరిచారు. ఈ అగ్ర అరుణోదయ కళాకారులు లేని లోటును నేటి యువ కళాకారులు తీర్చాలని వారు పిలుపునిచ్చారు.సిపిఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరు మధు మాట్లాడుతూ నేడు దేశంలో హిందుత్వ పాసిస్తూ భావాజాలం ప్రజలపై మనుషులను విషతుల్యం చేస్తుందని ఈ సమయములో నాగన్న లాంటి విప్లవ సాంస్కృతిక ఉద్యమ రథసారధిని కోల్పోవడం పీడిత ప్రజలకు ప్రజా సంస్కృతికి నష్టమని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యు జాతీయ నాయకురాలు గాజే ఝాన్సీ అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల చంద్రారెడ్డి సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి బండారి ఐలయ్య అరుణోదయ సాంస్కృతిక సమైక్య తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ఉదయగిరి అరుణోదయ జిల్లా అధ్యక్షులు పోలే పొంగు నాగయ్య ఏపీటీఎఫ్ మాజీ రాష్ట్ర నాయకులు వేణు సిఎల్సి రాష్ట్ర నాయకులు విప్లవ కుమార్ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ తిరుమలాయపాలెం మండల కార్యదర్శి గొర్రెపాటి రమేష్ జిల్లా నాయకులు ప్రకాష్,కోలా లక్ష్మీనారాయణ, సురేష్, వెంకటరామిరెడ్డి, గిరి, కాశీం, వీరబోయిన మల్లయ్య, జగన్, గుమ్మడి కనకరాజు కుటుంబ సభ్యులు జీవిత సహచరి పరకాల లక్ష్మి, అజయ్, గ్రామ సర్పంచ్ మందుల అరుణ గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి, మందుల యాదయ్య తదితరులు పాల్గొన్నారు.


