- అరుణోదయ నాగన్న ఆశయాలను కొనసాగిద్దాం:
- కామేపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి పుచ్చకాయల ఎంకన్న
ఏన్కూరు,జులై 11 ( నమస్తే న్యూస్)
ఈ సభలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్.కె ఖాసింఏన్కూర్. కామేపల్లి సబ్ డివిజన్ కార్యదర్శి పుచ్చకాయల ఎంకన్న,అరుణోద కామ్రేడ్ నాగన్న ఆశయాలని కొనసాగించాలని కామ్రేడ్ నాగన్న తన జీవితాంతం విప్ల ఉద్యమం కోసం సంస్కృతిక ఉద్యమం కోసం తన జీవితాన్నే ధారబోశారని నాగన్న గురించి ఎంత చెప్పుకున్న తక్కువేనని మాట్లాడారు.సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులుగా అరుణోదయ రాష్ట్ర గౌరవ అధ్యక్షులుగా అరుణోదయ వ్యవస్థాపకులు కవి గాయకులు రచయిత కళాకారుడు తన ఇంటి పేరుని అరుణోదయగా మార్చుకొని గత 50 సంవత్సరాల కాలం నుండి రైతు కూలీలు కార్మికులు పీడిత ప్రజలు అన్ని వర్గాల ప్రజలు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా తన ఆటపాటలతో ప్రజలను మేల్కొలిపి ఎంతో మందిని పోరాటాల వైపు నడిపించి ఈ దేశంలో దోపిడి పీడనలు అసమానతలు లేని మనిషిని మనిషి దోచుకునేసమాజం లేని రాజ్యం రావాలనిసమసమాజ స్థాపనే ధ్యేయంగా నిత్యనిర్బంధాలను రాజ్య హింసను ఎదురుకొని పేద ప్రజల కోసం తాను నమ్మిన సిద్ధాంతం కోసం తన చివరి శ్వాస వరకు తన ఆట పాటలతో పోరాటాలలో పాలుపంచుకొని వందలాది కార్యకర్తలను పోరాటాల వైపు నడిపించిననిజమైన కమ్యూనిస్టుగా నీతిగా నిజాయితీగా నిలిచిన ఆదర్శమూర్తి కామ్రేడ్ అరుణోదయ నాగన్న అని ఆయన బాటలో మనమందరం నడవాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నాగన్న స్వగ్రామమైన రాజారాం గ్రామంలో ఈనెల 13నఉదయం 10 గంటలకు జరుగు నాగన్నసంతాప సభలో రైతు lకూలీలు కౌవులు కళకారులు రచయితలు మేధావులు అభ్యుదయవాదులు యువకులు మహిళలు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో చిర్ర కృష్ణయ్య రాచబంటి వెంకటేశ్వర్లు పరిటాల వీరభద్రం రాచబట్టి రమేష్ రాచబంటి వెంకటేశ్వర్లు గుడిమెట్ల కోటయ్య బత్తుల నరేష్ వేముల మంగపతి వర్దబోయిన కృష్ణయ్య కోడూరు ఏను ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

