- నిరుపయోగంగా త్రాగునీటి చేతి పంపు.
- పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది.
- తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఐదో వార్డు ప్రజలు.
- తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల విజ్ఞప్తి
- నిరుపయోగంగా త్రాగునీటి చేతి పంపు.
- పట్టించుకోని గ్రామపంచాయతీ సిబ్బంది.
- తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్న ఐదో వార్డు ప్రజలు.
- తక్షణమే మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థుల విజ్ఞప్తి
తిరుమలాయపాలెం, జూలై 11 (నమస్తే న్యూస్):
ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం బీరోలు గ్రామపంచాయతీ పరిధిలోని ఐదో వార్డులో తాగునీటి సమస్య తీవ్రంగా మారింది. వార్డులో ఉన్న చేతి పంపు గత కొంతకాలంగా పిచ్చి మొక్కలతో కప్పుకుపోయి, శిధిలావస్థకు చేరడంతో ప్రజలు నీటిని వినియోగించుకోవడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.చేతి పంపు పరిసరాల్లో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో పాటు పంపు మరమ్మతుల అవసరం ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో తాగునీటి కోసం మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.ఇప్పటికైనా గ్రామపంచాయతీ అధికారులు స్పందించి చేతి పంపు పరిసరాలను శుభ్రపరచడంతో పాటు మరమ్మతులు చేపట్టి ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించాలని ఐదో వార్డు ప్రజలు కోరుతున్నారు.

