- గ్రామపంచాయతీ అభివృద్ధిలో వార్డ్ మెంబర్లు కీలక పాత్ర పోషించాలి.
- -ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి పంచాయతీరాజ్ చట్టంపై అవగాహన.
- ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి.
డోర్నకల్ /మరిపెడ(జులై 10)నమస్తే న్యూస్.
మరిపెడ మండలం గిరిపురం గ్రామపంచాయతీలోని రైతు వేదికలో చివరి రోజు నిర్వహించిన గ్రామపంచాయతీ వార్డు సభ్యుల ఓరియంటేషన్ శిక్షణ కార్యక్రమంలో ఎంపీడివో వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ దశలవారీగా మరిపెడ మండలంలోని నలబైంది గ్రామపంచాయతీలోని వార్డు సభ్యులకు పంచాయతీ రాజ్ చట్టాలపై గ్రామాభివృద్ధి,పరిపాలన అంశాలపై అవగాహన కల్పించడం జరిగిందన్నారు.గ్రామపంచాయతీలు అభివృద్ధి జరగాలంటే,మొదటగా వార్డులల్లో ఉన్న సమస్యలను వార్డ్ మెంబర్లు గుర్తించి,గ్రామ సర్పంచ్ కు తెలియజేయాలన్నారు.గ్రామపంచాయతీ ఏ నిధులతో అభివృద్ధి జరుగుతుందో స్పష్టంగా వార్డ్ మెంబర్లకు తెలియజేయడం జరిగిందన్నారు.అనంతరం ట్రైనింగ్ పూర్తి చేసుకున్న వార్డ్ సభ్యులకు కార్యదర్శులతో కలిసి సర్టిఫికెట్లను అందచేశారు.ఈ కార్యక్రమంలో గిరిపురం సర్పంచ్ నీలా సైదులు ట్రైనర్లు రామోజీ,ప్రణయ్,వెంకన్న సుమన్,దేవయ్య మరియు ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు విజిత,రాజోద్దీన్,అశోక్,నేహా తరణం,సృజన,ఉమేష్ పావని,ఆపరేటర్లు ఉమా,ఉమేష్ మరియు ఆయా గ్రామాల వార్డు సభ్యులు పాల్గొన్నారు.


