గాలివారి గూడెంలో పల్స్ పోలియో కార్యక్రమం… పాల్గొన్న సర్పంచ్ కవిత సుదర్శన్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ(జూన్ 28)నమస్తే న్యూస్.
గాలివారి గూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ నారెడ్డి కవిత సుదర్శన్ రెడ్డి ప్రత్యేక చొరవతో ఆదివారం గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా నిర్వహించారు.సర్పంచ్ కవిత సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మరిపెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ గుగులోత్ రవి నాయక్ పాల్గొని 0-5 సంవత్సరాల లోపు చిన్నారులకు పల్స్ పోలియో చుక్కలు వేశారు.కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సర్పంచ్ కవిత సుదర్శన్ రెడ్డి రెండు రోజుల ముందు నుంచే గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయించారు.ఆశా,అంగన్వాడీ కార్యకర్తలతో సమావేశమై ఇంటింటికీ తిరిగి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.ఉదయం 8 గంటల నుంచే బూత్‌ల వద్ద ఉండి స్వయంగా పర్యవేక్షించారు.ఈ సందర్భంగా సర్పంచ్ కవిత సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ మన గ్రామంలో ఒక్క చిన్నారి కూడా పోలియో చుక్కలు వేసుకోకుండా మిగిలిపోకూడదు.ప్రతి ఒక్క తల్లి తండ్రులు బాధ్యత అని గుర్తు చేశారు.పంచాయతీ తరఫున వైద్య సిబ్బందికి పూర్తి సహకారం అందిస్తాం.పోలియో రహిత గాలివారి గూడెం మన లక్ష్యం అని స్పష్టం చేశారు.చుక్కలు వేయించుకున్న ప్రతి చిన్నారిని ఆమె ఆప్యాయంగా పలకరించారు.కార్యక్రమంలో ఉపసర్పంచ్ బల్లం ఎల్లయ్య,వార్డు సభ్యులు ఏడెల్లి వెంకన్న,రాజుల లింగయ్య,ఎల్లబోయిన అనిత,వీరితో పాటు గ్రామ పెద్దలు,ఆశా కార్యకర్తలు,అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.అంగన్వాడీ కేంద్రం,ప్రభుత్వ పాఠశాల వద్ద ఏర్పాటు చేసిన బూత్‌లలో సాయంత్రం 5 గంటల వరకు చుక్కలు వేశారు.సర్పంచ్ ఆదేశాల మేరకు సిబ్బంది ఇంటింటికీ తిరిగి మిగిలిపోయిన పిల్లలకు డోసులు అందించారు.అనంతరం డాక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ,సర్పంచ్ సహకారంతో గ్రామంలో 100% లక్ష్యాన్ని చేరుకున్నాం.ఒక్క చుక్క ప్రాణం పోస్తుంది” అని అన్నారు.సర్పంచ్ చొరవను గ్రామ పెద్దలు ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో గాలివారి గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో దాదాపు 180 మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు నిర్వాహకులు తెలిపారు…
