పోషణే ఆరోగ్యానికి పునాది
గర్భిణీలు, బాలింతలు పోషకాహారం తీసుకోవాలి :
మేడిదపల్లి గ్రామ సర్పంచ్ మోర అనిల్ రెడ్డి
తిరుమలాయపాలెం అక్టోబర్ 4 (నమస్తే న్యూస్)
తిరుమలాయపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మేడిదపల్లి గ్రామంలో శనివారం గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు పోషణ మాసోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు గర్భిణీ స్త్రీలకు సంప్రదాయ పద్ధతిలో శ్రీమంతాలు నిర్వహించగా, చిన్నారులకు అన్నప్రసన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గ్రామ సర్పంచ్ మోర అనిల్ రెడ్డి మాట్లాడుతూ.. గర్భిణీ స్త్రీలకు శ్రీమంతాలు, చిన్నారులకు అన్నప్రసన కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. గర్భిణీలు, బాలింతలు, చిన్నారులు ఆరోగ్యంగా ఉండేందుకు తప్పనిసరిగా మంచి పోషకాహారం తీసుకోవాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రభుత్వం అందిస్తున్న పోషకాహార కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మేడిదపల్లి అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన గర్భిణీ స్త్రీలకు సీమంతాలు పోషణ మహోత్సవ కార్యక్రమం లో చిన్నారులకు అన్నప్రసన వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం గ్రామ సర్పంచ్ మోర అనిల్ రెడ్డి వరలక్ష్మి వరలక్ష్మి గర్భిణీ స్త్రీలకు పూలు పండ్లు సారే వడి నింపి దంపతులను ఆశీర్వదించారు తల్లులకు పోషకాహారం ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోవిందు రమేష్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు స్వప్న, గ్రామపంచాయతీ వార్డు సభ్యులు శ్రీలత, లచ్చమ్మ, ఏఎన్ఎం ఉండేటి మణి, అంగన్వాడీ టీచర్లు చిలక బత్తిని నిర్మల, ఎన్. ఉపేంద్ర, ఆశా కార్యకర్తలు నాగలక్ష్మి, విజయ, ఆయా నాగేంద్ర, గర్భిణీ స్త్రీలు, తల్లులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
