నమస్తే న్యూస్/డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణానికి చెందిన ఆర్కావత్ సీతమ్మ (68) అనారోగ్య కారణాలతో మృతి చెందారు.ఆమె మృతి విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ఆదివారం సీతమ్మ భౌతికగాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ సందర్భంగా సీతమ్మ మృతిపట్ల సంతాపం వ్యక్తం చేస్తూ,కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి,ఈ విషాద సమయంలో మనోధైర్యంతో ఉండాలని సూచించారు.సీతమ్మ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.కార్యక్రమంలో స్థానిక వార్డు కౌన్సిలర్ జాటోతు సురేష్,కోఆప్షన్ సభ్యుడు గుండగాని వెంకన్న,దూగుంట్ల వెంకన్న తదితరులు పాల్గొని సీతమ్మ భౌతికకాయానికి నివాళులర్పించారు..
