మరిపెడ/అక్టోబర్ 4 (నమస్తే న్యూస్):
స్వేరో మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐనాల రాజేష్ నియమితులయ్యారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమానికి స్వేరో రాష్ట్ర నాయకులు కిరణ్,ఐలయ్య ముఖ్య అతిథులుగా హాజరై జిల్లా కమిటీని నియమించారు.ఇందులో భాగంగా జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఐనాల రాజేష్‌ను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు.ఈ సందర్భంగా ఐనాల రాజేష్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో జిల్లా ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన స్వేరో రాష్ట్ర కమిటీ సభ్యులకు,జిల్లా కమిటీ సభ్యులకు,స్వేరో నాయకులందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.తనకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ,తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్వేరో జిల్లా నాయకులు,మండల నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..
