1,431 మంది మహిళలకు గాను 1,367 మంది పరీక్షకు హాజరు
మహిళలు విద్యావంతులై చైతన్యవంతులు కావాలి : ఉల్లాస్ డైరెక్టర్ బీఎన్ఎన్ లక్ష్మీజీ రావు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 27 ( న్యూస్)
తిరుమలాయపాలెం మండలం లో మహిళా సంఘాల్లోని నిరక్షరాస్య సభ్యులకు ఉల్లాస్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం రాత పరీక్ష నిర్వహించారు. మండలంలోని 40 గ్రామ పంచాయతీల పరిధిలో మహిళా సంఘాలకు చెందిన 1,431 మంది సభ్యులను పరీక్షకు ఎంపిక చేయగా, వారిలో 1,367 మంది పరీక్షకు హాజరై తమ విద్యా సామర్థ్యాన్ని చాటుకున్నారు.పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించేందుకు రాష్ట్ర ఉల్లాస్ డైరెక్టర్ బీఎన్ఎన్ లక్ష్మీజీ రావు, జిల్లా అడల్ట్ ఎడ్యుకేషన్ డీడీ సీహెచ్. రాజేంద్రప్రసాద్, ఉల్లాస్ జేఏ డీడీ ఏ. శ్రీనివాస్ పరీక్షా కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా మహిళలు పరీక్ష రాస్తున్న విధానాన్ని పరిశీలించి, వారికి పలు సూచనలు, సలహాలు అందించారు.ఈ సందర్భంగా ఉల్లాస్ డైరెక్టర్ బీఎన్ఎన్ లక్ష్మీజీ రావు మాట్లాడుతూ ప్రతి మహిళ విద్యను అభ్యసించి అక్షరాస్యత సాధించడంతో పాటు సమాజంలో చైతన్యవంతురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. అక్షరాస్యత ద్వారా మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, సమాజ అభివృద్ధిలో వారు మరింత కీలక పాత్ర పోషించగలరని తెలిపారు.మహిళా సంఘాల సభ్యులకు విద్యపై ఆసక్తి కల్పిస్తూ ఉల్లాస్ కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు సూచించారు. పరీక్ష ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేశారు.ఈ కార్యక్రమం లో ఏపీఎం ఐ. సత్యనారాయణ రాజు, సీసీ ప్రభాకర్, వివో ఏ లు మేకల కృష్ణవేణి, పరికపల్లి స్రవంతి, గోపోజు ఉపేంద్ర, కరుణ, కళ్యాణి, ధనలక్ష్మి, కుసుమ, వేల్పల సుశీల, నాగమణితో పాటు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.


