కదలిరండి.. ఖమ్మం రైతు కూలీల బహిరంగ సభకు
తిరుమలాయపాలెం మండల అధ్యక్ష, కార్యదర్శులు గొర్రెపాటి వీరస్వామి, అచ్చా ఉప్పలయ్య పిలుపు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 27 ( న్యూస్)
అఖిలభారత రైతు కూలీ సంఘం ఏఐకేఎంఎస్ 4వ జాతీయ మహాసభల సందర్భంగా రేపు సెప్టెంబర్ 28న ఖమ్మం పట్టణంలో నిర్వహించనున్న మహాప్రదర్శన, బహిరంగ సభకు రైతులు, రైతు కూలీలు, వ్యవసాయ కార్మికులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఏఐకేఎంఎస్ తిరుమలాయపాలెం మండల అధ్యక్ష, కార్యదర్శులు గొర్రెపాటి వీరస్వామి, అచ్చా ఉప్పలయ్య పిలుపునిచ్చారు.
రైతులు, రైతు కూలీల సమస్యలపై దేశవ్యాప్తంగా పోరాటాలను మరింత బలోపేతం చేసేందుకు జరుగుతున్న ఈ జాతీయ మహాసభలు ఎంతో ప్రాధాన్యత కలిగినవని వారు తెలిపారు. భూమి సమస్య పరిష్కారం, పంటలకు గిట్టుబాటు ధరలు, రైతు కూలీలకు ఉపాధి, కూలి రేట్ల పెంపు, వ్యవసాయానికి అవసరమైన ఎరువులు సకాలంలో అందించడం, రైతు వ్యతిరేక విధానాలను ఉపసంహరించుకోవడం వంటి డిమాండ్లపై రైతు కూలీలు ఐక్యంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు.
దేశంలోని 16 రాష్ట్రాల నుంచి ప్రతినిధులు పాల్గొంటున్న ఈ జాతీయ మహాసభలకు ఖమ్మం వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
రైతు కూలీల హక్కుల కోసం జరిగే ఈ బహిరంగ సభను జయప్రదం చేసేందుకు తిరుమలాయపాలెం మండలం నుంచి రైతులు, రైతు కూలీలు పెద్ద సంఖ్యలో కదిలిరావాలని వారు పిలుపునిచ్చారు.
కదలిరండి.. కదిలిరండి..
ఖమ్మం రైతు కూలీల బహిరంగ సభకు కదలిరండి!
