అంబేద్కర్ అభయహస్తం పథకాన్ని వెంటనే అమలు చేయాలి
సామాజిక అసమానతలపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలి
సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య, మరిపెడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్
నమస్తే న్యూస్/సెప్టెంబర్ 27,డోర్నకల్ నియోజకవర్గం ప్రతినిధి:
చేవెళ్ల డిక్లరేషన్‌లో భాగంగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత,గిరిజనులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు అల్వాల వీరయ్య,మరిపెడ మండల కార్యదర్శి గుండగాని మధుసూదన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఆదివారం మరిపెడ మండలం గుండెపూడి గ్రామ సీపీఎం శాఖ సమావేశం గ్రామ కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్ అధ్యక్షతన జరిగింది.ఈ సందర్భంగా అల్వాల వీరయ్య మాట్లాడుతూ,కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు మూడు సంవత్సరాలు కావస్తున్నా,దళిత,గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని విమర్శించారు.దళితులు,గిరిజనులు సామాజిక వివక్ష,అంటరానితనం,అవమానాలు,ఆకలి,ఉపాధి లేమితో ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం,ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం దళిత,గిరిజనుల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.మైదాన ప్రాంత గిరిజనులు,ఆదివాసీలు కొండలు,కోనల్లో,పట్టణాలు,గ్రామాలకు దూరంగా నివసిస్తున్నప్పటికీ,వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని అన్నారు.గిరిజన ప్రాంతాల్లో రహదారులు,సైడ్ డ్రైనేజీ,పల్లె దవాఖానాలు,ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సౌకర్యాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.గత టీఆర్ఎస్ ప్రభుత్వం గుంజుకున్న అసైన్డ్ భూములను తిరిగి దళిత,గిరిజనులకు అందిస్తామని ఇచ్చిన హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు.2013 చట్టం ప్రకారం అసైన్డ్ భూములకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు.నూతనంగా ఏర్పాటు చేసిన 3,146 గిరిజన తండాలకు రెవెన్యూ హోదా కల్పించి,రూ.2 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.తండాల్లో అంతర్గత రహదారులు,సైడ్ డ్రైనేజీ వ్యవస్థ,పల్లె దవాఖానాలు,ప్రభుత్వ పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాల భవనాలు,పశువుల దవాఖానాలు ఏర్పాటు చేయాలని కోరారు.అంబేద్కర్ అభయహస్తం పథకం కింద దళిత,గిరిజన యువతీ యువకులకు రూ.12 లక్షల ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.సామాజిక అసమానతలు,కుల వివక్ష,అంటరానితనంపై గ్రామాల్లో అవగాహన సదస్సులు నిర్వహించాలని కోరారు.ప్రభుత్వం దళిత,గిరిజనుల సమస్యలను పరిష్కరించకపోతే వారిని సమీకరించి ఆందోళనలు,పోరాటాలు నిర్వహిస్తామని వారు హెచ్చరించారు.ఈ సమావేశంలో సీపీఎం గ్రామ కార్యదర్శి బోడపట్ల రాజశేఖర్,గ్రామ నాయకులు అల్లి శ్రీనివాస్‌రెడ్డి,షేక్ షరీఫ్,బింగి మహేష్,వడ్లకొండ ఉప్పలయ్య,గంధసిరి మహేష్,బాసు నాయక్,భయ్యా సురేష్ తదితరులు పాల్గొన్నారు..
