SBI RSETI ఖమ్మం ఆధ్వర్యంలో శిక్షణ తరగతులు
ఉచిత భోజనం, వసతి సదుపాయాలు.. 28 నుంచి తరగతులు ప్రారంభం
ఖమ్మం: నిరుద్యోగ యువతులు, మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించే ఉద్దేశంతో SBI Rural Self Employment Training Institute (RSETI), ఖమ్మం ఆధ్వర్యంలో ఉచిత బ్యూటీషియన్ (Beauty Parlour Management) శిక్షణా తరగతులు నిర్వహించనున్నారు. ఈ శిక్షణ తరగతులు సెప్టెంబర్ 28, సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
శిక్షణలో చేరే అభ్యర్థులకు ఉచిత శిక్షణతో పాటు భోజనం, వసతి సదుపాయాలు కల్పించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థులు తప్పనిసరిగా తరగతులకు హాజరు కావాలని సూచించారు.
మరిన్ని వివరాలకు:
📞 6301438045, 9550986616
