రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 20 (నమస్తే న్యూస్ )
మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో నయనానందకరంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాలలో భాగంగా గ్రామంలోని చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ చైర్మన్ సామర్ల సునీల్ ఆధ్వర్యంలో అత్యంత భక్తిభావంతో ప్రతిష్టించిన గణేష్ మండపం వద్ద ఆదివారం ఒక ఆదర్శవంతమైన సేవా కార్యక్రమం చోటుచేసుకుంది. ప్రముఖ దాతలు రాయిండ్ల వెంకన్న – కృష్ణవేణి దంపతులు తమ కుమారునికి ప్రభుత్వ ఉద్యోగం లభించిన సంతోషకరమైన సందర్భాన్ని పురస్కరించుకుని, వినాయకుడి దయతోనే ఇది సాధ్యమైందనే కృతజ్ఞతా భావంతో భక్తజనులందరికీ భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అన్నదాన మహోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తిరుమలాయపాలెం స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్సై) కూచిపూడి జగదీష్ రిబ్బన్ కట్ చేసి కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించి దాతల ఉదారత్వాన్ని అభినందించారు.
ఈ సందర్భంగా ఎస్సై కూచిపూడి జగదీష్ మాట్లాడుతూ.. ఇంట్లో ఒక మంచి శుభకార్యం జరిగినప్పుడు వృథా ఖర్చులకు పోకుండా, ఇలా దైవసన్నిధిలో వందలాది మంది భక్తులకు అన్నప్రసాద వితరణ చేయడం రాయిండ్ల వెంకన్న కుటుంబ సభ్యుల సంస్కారానికి, సేవా గుణానికి నిదర్శనమని కొనియాడారు. ఉద్యోగం సాధించిన వారి కుమారుడికి ఈ సందర్భంగా ఆయన ప్రత్యేక అభినందనలు తెలిపి, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
దాతల కుటుంబ సభ్యులు జగదీష్, నికితలు ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని అన్నదాన నిర్వహణలో భాగస్వాములయ్యారు. భక్తులకు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, క్రమశిక్షణతో కూడిన ఏర్పాట్లు చేసి స్వయంగా వడ్డించారు. చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రతినిధులు, ఉత్సవ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దల సమన్వయంతో అన్నదాన కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా ముగిసింది. గ్రామంలోని భక్తులు, మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించి రాయిండ్ల వెంకన్న కుటుంబానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ గ్రామ సర్పంచ్ కామల్ల సువార్త వార్డు సభ్యులు పులుగుజ్జు ఉపేంద్రమ్మ పసలాది ముత్తయ్య పప్పుల ఉపేందర్ జాల ఉమేష్ పప్పుల చిన్న ఉపేందర్ నాగటి సురేష్ దొండేటి నిర్మల్ రావు సిపిఎం మండల కార్యదర్శి కొమ్ము శ్రీను నిర్సుల వెంకటేశ్వర్లు పప్పుల చందన్ గుడివాడ నవీన్ గంటల రాము తదితరులు పాల్గొన్నారు


