రామన్నపేట, సెప్టెంబర్ 20(నమస్తే న్యూస్)
రామన్నపేట-పల్లెపహాడ్ వరకు అస్తవ్యస్తంగా మారి ప్రమాదాలకుకారణమవుతున్న రోడ్డు గుంతలను పుడ్చాలని CPM ఆధ్వర్యంలో దుబ్బాక, మునిపంపుల గ్రామ సర్పంచులు గట్టు నర్సింహా, బొడ్డుపల్లి వెంకటేశం రోడ్డుపై నిలిచిన నీటి గుంతల్లో కూర్చొని వినూత్న నిరసన చేపట్టడం జరిగింది.
రొడ్డంతా ధ్వంసం అయ్యి ప్రయాణాలు నరక కుపంగా మారుతున్నా తట్టేడు మట్టి పొసే స్థితిలో లేని R&B అధికారులు,నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న అధికార యంత్రాంగం తీరును నిరసిస్తూ దుబ్బాక గ్రామంలో ప్రజలతో ఆందోళన చేపట్టిన సిపిఎం,సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ రామన్నపేట పల్లెపహాడ్ రోడ్డు మొత్తం గుంతల మయంగా మారిందని, నిత్యం ఈ రోడ్డు వెంబడి వేల సంఖ్యలో వాహనాలు తిరుగుతుంటాయి, ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు,వెంటనే రోడ్డు మరమ్మత్తులు చేపట్టాలని,వెంటనే సమస్య పరిష్కరించాలి లేకపోతే ప్రజలను కదిలించి జిల్లా కలక్టరేట్ ముట్టడి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక మునిపంపుల గ్రామ ప్రజలు సిపిఎం నాయకులు తదితరులు పాల్గొన్నారు.


