అధికార పార్టీ అనుకూలంగా ఏకపక్ష నిర్ణయాలు
కలెక్టర్ కు వినతి పత్రం.. అందించిన బిఆర్ఎస్ నాయకులు
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలయపాలెం,సెప్టెంబర్ 18 (నమస్తే న్యూస్ )
ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో గ్రామస్థాయిలోని ఇందిరమ్మ కమిటీలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నాయంటూ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన సర్పంచులు, నాయకులు తమ అభ్యంతరాలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.టీఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామపంచాయతీల్లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ కమిటీలు అర్హులైన లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయకుండా, తమకు అనుకూలమైన వ్యక్తులకే ఇళ్ల కేటాయింపులు చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. గ్రామంలోని పేదలు, ఇల్లు లేని అర్హులందరికీ సమాన అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీకి చెందిన గ్రామపంచాయతీ సర్పంచులు, నాయకులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక ప్రక్రియలో రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హత ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయాలని, గ్రామస్థాయిలో జరిగిన ఎంపిక ప్రక్రియపై సమగ్ర విచారణ చేపట్టాలని వారు కోరారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా లో ఉన్న సర్పంచుల తో పాటు తేట్టెల పాడు గ్రామ సర్పంచ్ చిర్రా నరసమ్మ__ కృష్ణయ్య, మరియు ఉపసర్పంచి పతంగి లక్ష్మీనారాయణ, తిరుమల పాలెం మండలం తరపున పాల్గొని కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించడం జరిగింది. ఇందిరమ్మ కమిటీలు రద్దయిన తర్వాత కూడా మళ్లీ ఇందిరమ్మ కమిటీల పేరుతో ఇండ్లు అర్హులైన వారికి ఇవ్వకుండా అనర్హులకు కేటాయిస్తున్నారని కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. గ్రామాలలో గ్రామపంచాయతీలలో ఇందిరమ్మ కమిటీ ల చర్యలను ఖండిస్తూ నూతనంగా ఎన్నికైన సర్పంచుల అధ్యక్షతన గ్రామ సెక్రెటరీ అధ్యక్షతన ఆయా గ్రామాలలో అర్హులైన పేదలకు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులకు నిజమైన లబ్ధిదారులు ఎంపిక చేసి ఇవ్వాలని కలెక్టర్ కు విన్నవించడం జరిగింది.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఇందిరమ్మ కమిటీలను గ్రామ/వార్డు, మండల/పట్టణ, నియోజకవర్గ, జిల్లా స్థాయిల్లో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం గతంలో సూచించింది. అలాగే ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరుపేద, ఇల్లు లేని కుటుంబాలకు గృహ నిర్మాణ సహాయం అందించడమే లక్ష్యంగా అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.
అయితే గ్రామస్థాయిలో జరుగుతున్న ఎంపిక ప్రక్రియపై తమకు అనేక అనుమానాలు ఉన్నాయని బి ఆర్ఎస్ నాయకులు పేర్కొంటూ, కలెక్టర్ జోక్యం చేసుకుని అర్హులైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెట్టెలపాడు గ్రామ సర్పంచ్ చిర్రా నరసమ్మ కృష్ణయ్య, శుద్ధ వాగు తండా సర్పంచ్ ఆర్మీ రవి తెట్టెలపాడు గ్రామ ఉపసర్పంచి పతంగి బి ఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు బిల్లగిరి ధనుంజయ్ లక్ష్మీనారాయణ, గుంటి పుల్లయ్య రెడ్డి మల్ల నరేందర్ మరియు గ్రామస్తులు మండల బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


