తరతరాలుగా కొనసాగుతున్న యల్మారెడ్డి కుటుంబ సంప్రదాయం
గ్రామ సుభిక్షం.. పాడిపంటల సమృద్ధి.. ఊరి అభివృద్ధి కోసం ప్రత్యేక పూజలు
కులమతాలు, రాజకీయాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో పాల్గొన్న గ్రామస్తులు
రిపోర్టర్: దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం, సెప్టెంబర్ 18 (నమస్తే న్యూస్ )
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏలువారి గూడెం గ్రామంలో శుక్రవారం ఐదవ రోజు కుంకుమ పూజ కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. కీర్తిశేషులు యల్మారెడ్డి సత్యనారాయణరెడ్డి కుమారులు యల్మారెడ్డి జైపాల్ రెడ్డి__ సునీత దంపతులు మరియు యల్మారెడ్డి అశోక రెడ్డి__ సువితా దంపతులు, ఎన్నారై కాంగ్రెస్ కన్వీనర్ యల్మారెడ్డి నరేందర్ రెడ్డి సతీమణి యల్మారెడ్డి స్వాతి రెడ్డి, మరియు గ్రామ ఉపసర్పంచి దేవారం దేవేందర్ రెడ్డి, కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో తరతరాలుగా కొనసాగుతున్న ఈ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని ఈ ఏడాది కూడా ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా కుంకుమ పూజలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. గ్రామంలో సుఖశాంతులు నెలకొనాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని, ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని, ఏలువారి గూడెం మరింత అభివృద్ధి చెందాలని కోరుకున్నారు.
తరతరాలుగా ఆధ్యాత్మిక సంప్రదాయం.. ఏలు వారి గూడెంలో తరతరాలుగా ఆనవాయితీగా నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలలో భాగంగా
యల్మారెడ్డి కుటుంబం ఆధ్వర్యంలో గ్రామంలో తరాలుగా ఆధ్యాత్మిక కార్యక్రమాలను కొనసాగించడం ఆనవాయితీగా వస్తోందని గ్రామస్తులు తెలిపారు. పండుగలు, పూజలు కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలుగానే కాకుండా గ్రామ ప్రజలందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చే సామాజిక వేడుకలుగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కులమతాలు, రాజకీయాలకు అతీతంగా గ్రామస్తులు పాల్గొని భక్తి, ఐక్యతను చాటారు. పండుగల సందర్భంగా గ్రామ ప్రజల మధ్య సోదరభావం, ఆత్మీయత మరింత బలపడాలని పలువురు ఆకాంక్షించారు.
నాయక్ యూత్ ఆధ్వర్యంలో అన్నదానం…
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నాయక్ యూత్ ఆధ్వర్యంలో భక్తులకు ఘనంగా అన్నదానం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. భక్తి కార్యక్రమంతో పాటు అన్నదానం నిర్వహించడం ద్వారా సేవాభావాన్ని చాటిన నాయక్ యూత్ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.
వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఏలువారి గూడెంలో నిర్వహించిన కుంకుమ పూజ కార్యక్రమం భక్తి, సంప్రదాయం, సేవాభావం, గ్రామ ఐక్యతకు ప్రతీకగా నిలిచింది. ఈ కార్యక్రమంలో ఎల్మారెడ్డి జైపాల్ రెడ్డి సునీత దంపతులు, యల్మారెడ్డి అశోక రెడ్డి సునీతా దంపతులు, గ్రామ ఉప సర్పంచ్ దేవారం దేవేందర్ రెడ్డి కవితా దంపతులు, ఎన్నారై కాంగ్రెస్ కన్వీనర్ యల్మారెడ్డి నరేందర్ రెడ్డి సతీమణి యల్మారెడ్డి స్వాతి రెడ్డి పుణ్య దంపతులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించి తీర్థప్రసాదాలు స్వీకరించినారు.
ఈ కార్యక్రమంలో సర్పంచి గుగులో తులసి నరసింహ, ఉప సర్పంచ్ దేవారం దేవేందర్ రెడ్డి, మద్దికుంట్ల యమునా రెడ్డి, కంచాల భద్రారెడ్డి, నాయక్ యూత్ సభ్యులు గుగులోతు కుమార్, బౌసింగ్, శ్రీకాంత్, ఉపేందర్, వెంకన్న, వీరు నాయక్, రాజేష్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




