భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్న గణనాథుని నవరాత్రి ఉత్సవాలు.. పెద్ద సంఖ్యలో పాల్గొన్న భక్తులు
డోర్నకల్/మరిపెడ, సెప్టెంబర్ 19 (నమస్తే న్యూస్):
మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తవాడ ఇందిరా కాలనీలో గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గణనాథునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తులు భక్తిశ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు.విఘ్నాలను తొలగించి శుభాలను ప్రసాదించే విఘ్నేశ్వరుడి కృపతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని భక్తులు ఆకాంక్షించారు. గణపతి సన్నిధిలో భక్తులకు అన్నప్రసాదాన్ని అందించడం ద్వారా ఉత్సవ కమిటీ సభ్యులు సేవాభావాన్ని చాటుకున్నారు.అన్నప్రసాద వితరణ కార్యక్రమానికి భక్తులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై ప్రసాదాన్ని స్వీకరించారు. గణనాథుని ఆశీస్సులతో ప్రతి ఇంటా ఆనందం, ఐశ్వర్యం, శాంతి నెలకొనాలని నిర్వాహకులు ఆకాంక్షించారు. ఉత్సవ కమిటీ సభ్యులు, మహిళలు, యువత, స్థానికుల సహకారంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగింది.ఈ కార్యక్రమాన్ని పులి శ్రీనివాస్, అక్కెనపల్లి సైదులు, సంతు, ముండవర్ రాజేష్, సాయి, మల్లయ్య, జంపయ్య, చింటూ తదితరులు ముందుండి నిర్వహించారు. మహిళలు పులి ఉమా, కవిత, శిరీష, నాగమణి, సరస్వతి, భవాని, చంద్రకళతో పాటు యువత, యువకులు పాల్గొన్నారు.

