పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని వెల్లడి.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 19 (నమస్తే న్యూస్).మరిపెడ మండలం ఎర్జర్ల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా గడ్డం వెంకన్న ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.గ్రామంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో నాయకులు,కార్యకర్తల సమక్షంలో ఆయనను గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు.కాంగ్రెస్ నాయకులు నూకల శ్రీరంగారెడ్డి,గ్రామ సర్పంచ్ బాధావత్ లచ్చపతి సమక్షంలో గడ్డం వెంకన్నను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఆయన నాయకత్వంలో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం కావాలని నాయకులు,కార్యకర్తలు ఆకాంక్షించారు.పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు గ్రామ అభివృద్ధి,ప్రజా సమస్యల పరిష్కారానికి నాయకులు,కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు గడ్డం వెంకన్న మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకులు,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు.ఈ సమావేశంలో యూత్ అధ్యక్షుడిగా మధు,ఉపాధ్యక్షుడిగా టేకుమట్ల భద్రయ్య, ప్రధాన కార్యదర్శిగా వీరన్నతో పాటు కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.అనంతరం నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు,కార్యవర్గ సభ్యులకు కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు శుభాకాంక్షలు తెలిపారు..

