మర్యాదపూర్వకంగా కలిసిన ఖార్గిల్ సొసైటీ చైర్మన్ రాంబాబు.
డోర్నకల్/మరిపెడ ప్రతినిధి,సెప్టెంబర్ 19(నమస్తే న్యూస్).మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండల కేంద్రంలో నూతన న్యాయస్థానం ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులను ఖార్గిల్ సొసైటీ చైర్మన్ గాదె రాంబాబు శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. మరిపెడ ఆర్అండ్బీ అతిథి గృహంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఈవీ వేణుగోపాల్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావులను కలిసి పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఖార్గిల్ సొసైటీ చైర్మన్ గాదే రాంబాబు న్యాయమూర్తులతో కొద్దిసేపు మర్యాదపూర్వకంగా మాట్లాడారు.మరిపెడ మండల కేంద్రంలో నూతన న్యాయస్థానం ప్రారంభం కావడం స్థానిక ప్రజలకు, న్యాయవాదులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. న్యాయపరమైన సేవలు ప్రజలకు మరింత చేరువయ్యే అవకాశం ఏర్పడిందన్నారు.నూతన న్యాయస్థానం విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో తొర్రూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వెంకట రత్నం, మరిపెడ మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్, పలువురు న్యాయవాదులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు..

