అబ్బాయిపాలెంలో ఐలమ్మది ఘనంగా 41వ వర్ధంతి.
సీఐటీయూ మండల కన్వీనర్ దుండి వీరన్న.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 12 (నమస్తే న్యూస్).
నాటి భూస్వామ్య వ్యవస్థలో పేదలు,కూలీలు,రైతులు,వృత్తిదారులు దోపిడీకి గురవుతున్న సమయంలో దానిని ఎదిరిస్తూ ప్రజలకు ప్రశ్నించే గొంతుకగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని సీఐటీయూ మండల కన్వీనర్ దుండి వీరన్న అన్నారు.శనివారం మరిపెడ మండలంలోని అబ్బాయిపాలెం గ్రామంలో సీఐటీయూ–కేవీపీఎస్ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సభకు కొండ ఉప్పలయ్య అధ్యక్షత వహించగా,సీఐటీయూ మండల కన్వీనర్ దుండి వీరన్న పాల్గొని ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా దుండి వీరన్న మాట్లాడుతూ..ఐలమ్మ ఆనాడు భూస్వామ్య దోపిడీకి,వెట్టిచాకిరీకి,కుల వివక్షకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడారని అన్నారు.ఆమె పోరాట స్ఫూర్తితో గ్రామాలకు గ్రామాలే ఐలమ్మ వెంట నడిచాయని పేర్కొన్నారు.అణగారిన వర్గాల ఆత్మగౌరవం కోసం సాగిన వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో ఐలమ్మ కీలక పాత్ర పోషించారని తెలిపారు.
నేటికీ సమాజంలో కుల వివక్ష, దోపిడీ వంటి సమస్యలు కొనసాగుతున్నాయని ఆయన ఆరోపించారు.అణగారిన వర్గాల హక్కులు,ఆత్మగౌరవం కోసం ఐలమ్మ సాగించిన పోరాటాన్ని నేటి తరం స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు జిన్నా లచ్చయ్య,సీఐటీయూ నాయకులు జినక సైదులు,రామ్మూర్తి,కామిడ్ల వెంకన్న,రామచంద్రు,కేవీపీఎస్,అంబేద్కర్ యూత్ అధ్యక్షులు జినక ప్రమోద్,ఉపేందర్,నందిపాటి స్టాలిన్,కత్తుల శ్రీను,కిరణ్,నవీన్,పరశురాములు,యాకన్న,బాబు,మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

