బాధిత కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన చైర్మన్ బండారి మల్లయ్య.
రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండలం వినోభనగరం గ్రామానికి చెందిన మేకల పర్వతాలు నిన్న ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. విషయం తెలుసుకున్న బయ్యారం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్య ఈ రోజు మేకల పర్వతాలు మృతిదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బండారి మల్లయ్య మాట్లాడుతూ, మేకల పర్వతాలు మరణం బాధాకరమని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అలాగే కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు.
అనంతరం సొసైటీ డైరెక్టర్ వేల్పుల శ్రీనివాస్ తమ్ముడు వేల్పుల యాలాద్రి ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతూ మరణించగా ఈ రోజు వారి దిశాదశకర్మ కార్యక్రమానికి బయ్యారం సింగిల్ విండో చైర్మన్ బండారి మల్లయ్య హాజరై వేల్పుల యాలాద్రి చిత్రపటానికి పూలతో ఘన నివాళులర్పించారు.
అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు..

