ఉత్తర నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు.భక్తులకు తీర్థప్రసాదాల పంపిణీ.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 12 (నమస్తే న్యూస్).
మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శ్రీ అయ్యప్ప స్వామి వారి జన్మ నక్షత్రం ఉత్తర నక్షత్రం సందర్భంగా శనివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ సందర్భంగా ఆలయంలోని మూలవిరాట్‌కు అర్చకులు బుక్కమఠం నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పంచామృత అభిషేకాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు.
అభిషేక కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అయ్యప్ప స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ గోలి జోషిత్ మణికంఠ,ధర్మకర్తలు గోలి శ్రీనివాస్,పద్మతో పాటు భక్తులు కొంపల్లి వేణుగోపాల్ రెడ్డి,వెన్నె నాగేశ్వరరావు,బోనగిరి సత్యనారాయణ, బొల్లం శ్రీనివాస్, మూడ్ శ్రీకుమార్ తదితరులు పాల్గొన్నారు.

