రిపోర్టర్: పిల్లల మల్లికార్జున్
సెంటర్: బయ్యారం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ఆదివాసీ టీచర్స్ ఫెడరేషన్(TS ATF) సమావేశం జరిగింది.
సమావేశానికి హాజరైన TS ATF రాష్ట్ర అధ్యక్షులు మోకాళ్ళ శ్రీనివాస రావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కబ్బాకుల రవి మాట్లాడుతూ ఏజన్సీ ప్రాంతాల్లో ఆదివాసీలకు ఉపాధ్యాయ, ఉద్యోగ నియామకాలలో 100 శాతం రిజర్వేషన్లు అమలు కోసం జీ ఓ నెంబరు 3 సాధనకై ఆదివాసీ ఉపాధ్యాయులు పోరాడాలని పిలుపునిచ్చారు.
ఏజన్సీ ప్రాంతాల్లో ఆదివాసీ ఉపాధ్యాయులకు 100 శాతం పదోన్నతులు గతంలో ఇప్పించిన ఏకైక సంఘం TS ATF మాత్రమేనని వారు అన్నారు. ఆదివాసీ ఉపాధ్యాయులు TS ATF సంఘాన్ని బలపరచి జీ ఓ నెంబరు 3 కి చట్టబద్దత సాధించాలని అందుకు ప్రభుత్వంతో పోరాడాలని అన్నారు.ఉపాధ్యాయుల సమస్యలను ఎప్పటికప్పుడు మండల స్థాయి, జిల్లా స్థాయిలో ప్రాతినిధ్యం చేస్తూ సమస్యల పరిష్కారానికి TS ATF కృషి చేస్తుందని అన్నారు.అనంతరం రాష్ట్ర ప్రచార కార్యదర్శి కుర్సo అంజయ్య ఎన్నికల అధికాారిగా వ్యవహరించి భద్రాద్రి జిల్లా కమిటీని ఎంపిక చేశారు.
TS ATF భద్రాద్రి జిల్లా నూతన కమిటీ
గౌరవ అధ్యక్షులుకంగాల వెంకయ్య, అధ్యక్షులు కారం రాంబాబు ,ప్రధాన కార్యదర్శి ఊకె కృష్ణ ఉపాధ్యక్షులు పాయం విజయ్ బాబు ,కోరం శంతారావు కోశాధికారి పూనెం బాలరాజు
కార్యదర్శులు:ముడిగ వెంకటేశ్వర్లు ,పూనెం కమలాకర్పెం డకట్ల నాగేశ్వరావు మోకాళ్ళ మోహన్ రావు మోకాళ్ళ కృష్ణార్జున రావు
బొల్లి అంజయ్య,పాయం రమేష్మో కాళ్ళ ప్రభాకర్ ,కల్తీ వీరభద్రమ్
రాష్ట్ర కార్యదర్శులుపాయం ఆనందరావు,చాపల రమేష్ బాబు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి ఉండం నాగేందర్, రాష్ట్ర కార్యదర్శి కుంజా కృష్ణ, మహబూబాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్తీ భాస్కర్, వివిధ మండలాల బాధ్యులు కొడెం కృష్ణయ్య, తొలెం ఈశ్వర్, అరెం రవి కుమార్, కల్తీ రామకృష్ణ, కొర్స ఆదినారాయణ, గలిగె రాంబాబు, ఈసం పగడయ్య, ఊకె పగడయ్య,
కల్తీ సత్యం, ఇతర జిల్లా బాధ్యులు పాల్గొన్నారు.

