మౌలిక వసతులు, భద్రతా ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 12 (నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన కోర్టు భవనాన్ని మహబూబాబాద్ జిల్లా న్యాయమూర్తి మురళీమోహన్ శనివారం పరిశీలించారు.ఈ సందర్భంగా కోర్టు భవనంలోని వివిధ విభాగాలను సందర్శించి,కోర్టు కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన మౌలిక వసతులు,సౌకర్యాలపై సంబంధిత అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.నూతన కోర్టు భవనం అందుబాటులోకి రావడంతో మరిపెడ పరిసర ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయని అధికారులు తెలిపారు.కోర్టు నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు,భద్రతా చర్యలు,మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై జిల్లా న్యాయమూర్తి సంబంధిత అధికారులతో చర్చించారు.కోర్టు భవనంలో ప్రజలు,న్యాయవాదులు,సిబ్బందికి అవసరమైన సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించినట్లు సమాచారం.ఈ పరిశీలన కార్యక్రమంలో మరిపెడ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎల్.పవన్ కుమార్,తహసీల్దార్ కృష్ణవేణి,మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,అడ్వకేట్ సైదులు,లాలు తదితరులు పాల్గొన్నారు.


