- మండల జోనల్ స్థాయి క్రీడలు ముగింపు
- మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు. ప్రగతి,ఎంఈఓ గాదే అనిత దేవి
డోర్నకల్ /మరిపెడ,సెప్టెంబర్ 11(నమస్తే న్యూస్)
క్రీడలతోనే క్రీడాకారులకు శారీరక దారుఢ్యం తో పాటు మానసిక ఉల్లాసం కలుగుతుందని, మరిపెడ మున్సిపాలిటీ చైర్ పర్సన్ వీసారపు. ప్రగతి శ్రీపాల్ రెడ్డి అన్నారు. శుక్రవారం మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మండల విద్యాశాఖ అధికారి గాదె అనీతా దేవి ఆధ్వర్యంలో మండల స్థాయి జోనల్ కబడ్డీ, కోకో,వాలీబాల్, పోటీలను నిర్వహించారు. ఈ క్రీడల్లో కబడ్డీ పోటీల్లో బాలుర 14 సంవత్సరాల విభాగంలో మొదటి బహుమతి నర్సుల పేట, రెండో బహుమతి మరిపెడ బాలురకు, బాలికల విభాగంలో మరిపెడకు మొదటి బహుమతి చిన్నగూడూరు మండలానికి రెండో బహుమతి, కోకో బాలుర విభాగంలో చిన్న గూడూరు మొదటి బహుమతి, మరిపెడ మండలానికి రెండో బహుమతి, బాలికలు విభాగంలో చిన్న గూడూరుకు మొదటి బహుమతి, నర్సరావుపేటకు రెండో బహుమతి, వాలీబాల్ పోటీల్లో బాలురకు చిన్నగూరు మండలానికి మొదటి బహుమతి, మరిపెడ మండలానికి రెండో బహుమతి, బాలికలు విభాగంలో మరిపెడకు మొదటి బహుమతి, లక్షల పేటకు రెండో బహుమతి, గెలుచుకున్నారు గెలుపొందిన క్రీడాకారులకు వారి చేతుల మీదుగా ట్రోఫీలు, ప్రశంసాపత్రాలను బహుమతు లుగాప్రధానం చేశారు. అనంతరం గురుపూజోత్సవాన్ని పురస్కరించుకొని, మండల స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కార బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ! క్రీడల్లో గెలుపు ఓటములు సహజమేనన్నారు. ఓడినవారు గెలుపు కోసం నిరంతరం కృషి చేయాలి అన్నారు. క్రీడలతో ఇరు జట్ల మధ్య స్నేహ సంబంధాలు పెంపొందుతాయి అన్నారు. జాతీయస్థాయిలో క్రీడల్లో రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. విద్యార్థులు చదువుతోపాటు, క్రీడల్లో రాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ కాలం. సునీత ,రవీందర్ రెడ్డి, వివిధ ఉపాధ్యాయ సంఘం నాయకులు ,చిన్న గూడూరు, మరిపెడ , నరసింహుల పేట మండలాలకు చెందిన పీటీలు, మరిపెడ జోనల్ సెక్రెటరీ భూక్య. స్వప్న, వివిధ పాఠశాల పిఈటిలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

