నర్సింహులపేట, సెప్టెంబర్ 11 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన పోలీసు ఉద్యోగి నయీం పాషా కుమార్తెలు సనా, షైనా కోకో క్రీడల్లో ప్రతిభ చాటారు. దంతాలపల్లి మండలంలోని అక్షర హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న సనా, షైనా జిల్లా ప్రైవేట్ పాఠశాలల ఆధ్వర్యంలో నిర్వహించిన కోకో క్రీడా పోటీల్లో ప్రథమ స్థానాన్ని సాధించారు.ఈ ప్రతిభతో శనివారం నిర్వహించనున్న ఉమ్మడి వరంగల్ జిల్లా స్థాయి కోకో పోటీలకు వారు ఎంపికయ్యారు. ఉమ్మడి జిల్లా స్థాయి పోటీల్లో సనా, షైనా పాల్గొంటారని వారి తండ్రి నయీం పాషా తెలిపారు.క్రీడల్లో ప్రతిభ కనబరిచి ఉమ్మడి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన సనా, షైనాలకు గ్రామస్థులు, విద్యాభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. వారికి మరింత ప్రోత్సాహం అందించాలని ఆకాంక్షించారు.

