డోర్నకల్ /మరిపెడ సెప్టెంబర్ 11(నమస్తే న్యూస్).
ఆరకోర విద్యుత్ సరఫరాతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని మహబూబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట సబ్ స్టేషన్ వద్ద రైతులు ధర్నాకు దిగారు.రైతులకు నన్నయమైన విద్యుత్తును సరాపరచేయాలని తమ ఆవేదనని వ్యక్తం చేశారు.సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఏడిఏ విద్యుత్ అధికారి కాళ్లను రైతులు మొక్కారు.తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి, రైతులకు ప్రజా పాలనలో తీరని అన్యాయం జరుగుతుందని తమ ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా తర్వాత అప్పటి తెలంగాణ సాధకుడు తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రైతులకు 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు, సాగునీరు అందజేసి రైతులును ఆదుకున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలో ఇచ్చిన ఉచిత హామీలకు మోసపోయి విద్యుత్ లేక గోసపడుతున్నామన్నారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేసి నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయాలని కోరారు.

