ఉత్తర్వులు జారీ చేసిన జేఏసీ రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్
రామన్నపేట సెప్టెంబర్ 11(నమస్తే న్యూస్)
తెలంగాణ జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ముత్యాల రమేష్ నియమితులయ్యారు.ఈ మేరకు జర్నలిస్టుల జేఏసీ రాష్ట్ర చైర్మన్ తోగరి కరుణాకర్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, వారి హక్కుల పరిరక్షణ కోసం ముత్యాల రమేష్ చేస్తున్న కృషిని గుర్తించి ఈ బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన జేఏసీ చైర్మన్ తోగరి కరుణాకర్‌కు ముత్యాల రమేష్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యలను జేఏసీ దృష్టికి తీసుకెళ్లి, వారి సంక్షేమం కోసం తనవంతు కృషి చేస్తానని ముత్యాల రమేష్ పేర్కొన్నారు.ఆయన నియామకం పట్ల పలువురు జర్నలిస్టులు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

