రామన్నపేట సెప్టెంబర్ 11(నమస్తే న్యూస్ )
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆహార భద్రత కార్డులు (స్మార్ట్ కార్డులు) పంపిణీ కార్యక్రమం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామపంచాయతీ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు, సర్పంచ్ కూనూరు సాయికుమార్ గౌడ్ ,చేతుల మీదుగా లబ్ధిదారులకు ఆహార భద్రత స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు,ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు భోగారం గ్రామ ఉపసర్పంచ్ బైకాని ఉమా మహేష్ యాదవ్, 1వ వార్డు సభ్యురాలు గోగు ప్రమీల రమేష్ యాదవ్, 3వ వార్డు మెంబర్ కనుక మల్లేష్ ముదిరాజ్, 4వ వార్డు మెంబర్ మేడి అంజనేయులు, 5వ వార్డు సభ్యురాలు నేరటి మానస సురేష్ యాదవ్, 6వ వార్డు సభ్యురాలు కడారి పావని పాపయ్య, 7వ వార్డు మెంబర్ గోగు సురేష్ యాదవ్, 9వ వార్డు సభ్యురాలు వనం అండాలు యాదగిరి, గ్రామపంచాయతీ కార్యదర్శి సుధా, గ్రామ పరిపాలన అధికారి జిపిఓ,లక్ష్మీదేవి, భోగారం పాఠశాల హెడ్మాస్టర్ శ్రీలత, భోగారం/సిరిపురం విద్యుత్ లైన్మెన్ కూనూరు మహేష్ గౌడ్, అంగన్వాడీ టీచర్ బత్తుల వసంత, ఫీల్డ్ అసిస్టెంట్ గాదే విమలమ్మ, గ్రామ సంఘం బంధం వివో,భోగ సంధ్యారాణి, భోగారం గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.

