విమోచన చరిత్రను భావితరాలకు అందించేలా చర్యలు తీసుకోవాలి
తహసీల్దార్‌కు బీజేపీ మండల శాఖ వినతి
నర్సింహులపేట, సెప్టెంబర్ 11 (నమస్తే న్యూస్)
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని సెప్టెంబర్ 17న ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ విమోచన పోరాట చరిత్రను శాశ్వతంగా పరిరక్షించేలా సప్త సంకల్పాలను అమలు చేయాలని కోరుతూ బీజేపీ నర్సింహులపేట మండల శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం తహసీల్దార్ రమేష్‌బాబుకు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ విమోచన పోరాట చరిత్రను భావితరాలకు అందించేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని వారు కోరారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడంతో పాటు, విమోచన ఉద్యమంలో పోరాడిన వీరుల చరిత్రను ప్రజలకు తెలియజేసే కార్యక్రమాలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు సూరబోయిన సతీష్ యాదవ్, మండల ప్రధాన కార్యదర్శి ఏరానాగి కుమారస్వామి, ఉపాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, బీసీ మోర్చా మండల అధ్యక్షుడు దాసరి వీరన్న తదితరులు పాల్గొన్నారు.

