కొండ వెంకన్న,సిఐటియు మండల నాయకులు.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్(నమస్తే న్యూస్).
నైజాం పరిపాలనను గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మకు జోహార్లునాడు జరిగిన తెలంగాణ రైతాంగ పోరాటంలో తెలంగాణ తల్లి ముద్దుబిడ్డ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల లేసి ఘనంగా నివాళులర్పించారు.మరిపెడ మండలం ఆనేపురం గ్రామంలో సిఐటియు ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ గారి 41వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా సిఐటియు మండల నాయకులు కొండ వెంకన్న మాట్లాడుతూ ఐలమ్మ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో ఆరోజు విసునూరు రామచంద్రారెడ్డి అనే దొరల గడిలో ఎర్రజెండాలు పాతి ఖబర్దార్ బిడ్డ రామచంద్రారెడ్డని ఐలమ్మ నాయకత్వంలో వేల ఎకరాల భూములను పంచినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ అంతే కాకుండా వెట్టి చాకిరికి వ్యతిరేకంగా అయ్యా నీ బాంచన్ అంటున్న బడుగు బలహీన వర్గాల చేత తుపాకులు పట్టించి సాయుధ పోరాటంలో ముందుండి నడిచి విసునూరు దేశముకులను గడగడలాడించిన వీరనారి చాకలి ఐలమ్మని వారున్నారు వేల ఎకరాల భూములు పంచి ఎన్నో గ్రామాలను దొరల కబంధస్థాల కింద నలిగిపోకుండా చూసి గ్రామాలకు గ్రామాలే సాయుధ పోరాటంలోకి వచ్చే విధంగా ప్రజల్లో చైతన్యం చేసినటువంటి ఘనత ఆ రోజుల్లో వీరనారి చాకలి ఐలమ్మకు దక్కిందని వారన్నారు ఇప్పుడున్న మహిళ లోకం వీరనారి ఐలమ్మ ఆశయాలను పునికి పుచ్చుకొని వారి ఆశయ సాధన కోసం ముందుకు నడవాలని వారి సందర్భంగా పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిఐటియు గ్రామ నాయకత్వం పాల్గొన్నారు వసుమతి యాకన్న పటాన్ మక్బుల్ పాషా ప్రవీణ్ కృష్ణ వెంకన్న చంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు

