జ్యోతి ప్రజ్వలణ చేసి ప్రారంభించిన చైర్ పర్సన్ ప్రగతి శ్రీపాల్ రెడ్డి.
డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 10(నమస్తే న్యూస్).
మరిపెడ పట్టణంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయ ఆవరణలో గురువారం ఎస్ జి ఎఫ్ జోనల్ లెవల్ సెలక్షన్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి.మున్సిపల్ చైర్ పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను లాంఛనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ,క్రీడలు విద్యార్థుల్లో శారీరక దృఢత్వంతో పాటు మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయని అన్నారు.జోనల్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు జిల్లా,రాష్ట్ర స్థాయిలో రాణించి మరిపెడ పట్టణానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో మరిపెడ మున్సిపల్ వైస్ చైర్మన్ కాలం సునిత రవీందర్ రెడ్డి,మండల విద్యాశాఖ అధికారి అనితా దేవీ,మున్సిపల్ కమిషనర్ కంచర్ల నరేష్ రెడ్డి,కౌన్సిలర్లు పానుగోతు రాములు,జాటోత్ సురేష్,మెరుగు రాము,తిరుపతి,బోడ భాస్కర్,కో ఆప్షన్ సభ్యులు గుండగాని వెంకన్న,షేక్ అజీజ్,వ్యాయామ ఉపాధ్యాయులు అనంతగిరి శ్రీను తదితరులు పాల్గొన్నారు.


