30 మంది విద్యార్థినులకు హెచ్పీవీ టీకాలు.. వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన
నర్సింహులపేట, సెప్టెంబర్ 10 (నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో విద్యార్థినులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను అందజేశారు.ఈ సందర్భంగా 30 మంది విద్యార్థినులకు హెచ్పీవీ వ్యాక్సిన్ వేసినట్లు డాక్టర్ కవిత తెలిపారు. విద్యార్థినులు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించడం ద్వారా అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చని సూచించారు. ఆరోగ్యంపై ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు.కార్యక్రమంలో పాఠశాల ఎస్ఓ స్వప్న, సూపర్వైజర్ సుజాత, ఉపాధ్యాయినుల బృందం, వైద్య సిబ్బంది అన్వేష్, ప్రసన్నకుమారి, కృష్ణవేణి, సునీత, సరస్వతి తదితరులు పాల్గొన్నారు.

