డోర్నకల్/మరిపెడ,సెప్టెంబర్ 09(నమస్తే న్యూస్).
మరిపెడ మున్సిపల్ కార్యాలయంలో ప్రజాకవి,తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిదాత కాళోజీ నారాయణరావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాళోజీ నారాయణరావు చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ నరేష్ రెడ్డితో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..కాళోజీ నారాయణరావు తన రచనలు,కవితల ద్వారా ప్రజల సమస్యలను సమాజం ముందుకు తీసుకువచ్చారని,తెలంగాణ ప్రజల హక్కులు,స్వేచ్ఛ,సామాజిక చైతన్యం కోసం తన కలంతో నిరంతరం పోరాడిన మహనీయుడని కొనియాడారు.ప్రజల బాధలను,ఆకాంక్షలను తన సాహిత్యంలో ప్రతిబింబించిన కాళోజీ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు జాటోతు సురేష్,మెరుగు రాము,కాంతమ్మ కరణ్ సింగ్,పానుగోతు రాములు,గంట్ల గౌతమ్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజోద్దీన్,గుగులోత్ లచ్చిరాం,గంట్ల మహిపాల్ రెడ్డి తదితరులు పాల్గొని కాళోజీ నారాయణరావుకు నివాళులర్పించారు…

