ఎన్నికల హామీలను అమలు చేయండి:
బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న
రిపోర్టర్ దామల్ల భాస్కర్
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 9 (నమస్తే ఓకే న్యూస్ )
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ప్రతిపక్ష పార్టీలపై అక్రమరస్తులు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలుపరచడంలో పూర్తిగా విఫలమైందని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు భాష బోయిన వీరన్న ఆరోపించారు. బుధవారం మండల పరిధిలోని పిండిప్రోలు గ్రామంలో ఎమ్మెల్సీ తాత మధుసూదన్ స్వగృహంలో నిర్వహించిన టిఆర్ఎస్ మండల ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేయడం కాకుండా ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
తాతా మధు అక్రమ అరెస్టుకు నిరసనగా దశలవారీగా ఉద్యమాలు చేపడతామని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు.
ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో నీటి ఎద్దడి ఏర్పడే ప్రమాదం ఉందని, ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కాళేశ్వరం మోటార్లను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బాషబోయిన వీరన్న మండల నాయకులు బిల్లగిరి ధనుంజయ్ పిండిప్రోలు ఉప సర్పంచ్ చామకూరి రాజ్ కుమార్ మాజీ సర్పంచ్ బోడ మంచనాయక్ మాజీ ఎంపిటిసి ధరావత్ శంకర్ తాత రవీందర్ పరికిపల్లి చంద్రశేఖర్ ముత్తయ్య చామకూరి వెంకన్న పిడతల రవీందర్ పోలిపొంగు వెంకటేశ్వర్లు వేల్పుల సైదులు జనక రమేష్ బానోత్ రవి భూక్య వీరన్న గంట కృష్ణ గుగ్గిళ్ళ అశోక్ తదితరులు పాల్గొన్నారు.



