డోర్నకల్/మరిపెడ, సెప్టెంబర్ 09(నమస్తే న్యూస్).
అత్యాచారయత్నం కేసులో నిందితుడిని మరిపెడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.మరిపెడ మండలం ఎలమంచిలి తండా పరిధిలోని ఇటికలగడ్డ తండాకు చెందిన వివాహిత మహిళ మూడు నెలల క్రితం వ్యవసాయ పొలానికి వెళ్తున్న సమయంలో అదే తండాకు చెందిన భూక్యా బాలు (40),తండ్రి లచ్చపతి,అత్యాచారయత్నానికి పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు భూక్యా బాలును బుధవారం అదుపులోకి తీసుకున్నారు.అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్కు తరలించినట్లు మరిపెడ ఎస్సై గండ్రాతి సతీష్ తెలిపారు…

