రామన్నపేట సెప్టెంబర్ 9(నమస్తే న్యూస్)
ఇంద్రపాలనగరం ZPHS స్కూల్ గ్రౌండ్ లో రామన్నపేట మండల స్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి బాలబాలికల ఖో ఖో, కబడ్డీ, వాలీబాల్ సెలక్షన్ పోటీలకు ముఖ్యఅతిధులుగా
తెలంగాణా రాష్ట్ర సర్పంచుల ఫోరం JAC రాష్ట్ర కార్యదర్శి సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ గారు.
మండల విద్యాధికారి సురేందర్ రెడ్డి గారితో కలిసి పోటీలను ప్రారంభించారు *
సర్పంచ్ విక్రమ్ మాట్లాడుతూ రామన్నపేట విద్యార్థులు జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలలో ఎంపిక అయి ప్రధమస్థానం లో బహుమతి సాధించాలన్నారు. క్రీడాకారులకు భోజన ఏర్పాట్లు చేసిన సర్పంచ్ విక్రమ్ గారికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కృతజ్ఞతలు తెలియచేశారు. ఈ కార్యక్రమం లో ప్రధానోపాధ్యాయులు కే. శేఖర్, BRS నాయకులు మందడి శ్రీధర్ రెడ్డి గారు, వ్యాయామ ఉపాధ్యాయులు పెద్దబోయిన మణి, సరోజ, రేణుక, కొండ సాయి, చందు, కల్పనా,AMC మాజీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, జిట్టబోయిన వెంకటేష్,మేకల నరేందర్,మాధం నాగేష్,రాధారపు శ్రీనివాస్,గ్రామ క్రీడాభిమానులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.


