నోముల ప్రవీణ్
కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా నాయకులు
రామన్నపేట సెప్టెంబర్ 9(నమస్తే న్యూస్)
నిన్న డప్పు చప్పుళ్లతో, ఆత్మగౌరవ నినాదాలతో కేసీఆర్ ఫామ్ హౌస్ వైపు కదిలిన దళిత జాతి బిడ్డల పాదముద్రలను ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో పసుపు నీళ్లతో కడిగారనే వార్త రాష్ట్రవ్యాప్తంగా దళిత సమాజంలో ఆగ్రహ జ్వాలలు రేపుతోంది,స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేసిన దళిత వ్యతిరేక వ్యాఖ్యలకు నిరసనగా, క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు, కాంగ్రెస్ శ్రేణులు నిన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పైకి దండెత్తారు. పోలీసులు వారిని అడ్డుకున్నా, డప్పులతో, నినాదాలతో తమ ఆవేదనను వినిపించారు,అయితే ఆ దళిత బిడ్డలు వెనుదిరిగిన వెంటనే, వారి పాదముద్రలు పడిన చోట పసుపు నీళ్లతో కడిగినట్లుగా వస్తున్న వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది నిజమైతే ఇంతకంటే దారుణం, ఇంతకంటే అవమానం మరొకటి ఉండదని దళిత మేధావులు మండిపడుతున్నారు,తెలంగాణ తెచ్చింది దళితులమే, కొట్లాడింది మేమే అని చెప్పుకునే కేసీఆర్, దళితులను ముఖ్యమంత్రిని చేస్తానని మాట ఇచ్చి, దళితబంధు పేరుతో మోసం చేసి, ఇప్పుడు ఏకంగా దళితుల పాదముద్రలను పసుపు నీళ్లతో కడిగే స్థాయికి దిగజారాడా? అని ప్రశ్నిస్తున్నారు,ఇది కేవలం పసుపు నీళ్లతో కడగడం కాదు, తెలంగాణలోని 30 లక్షల దళిత కుటుంబాల ఆత్మగౌరవాన్ని కడిగేయడమేనని, దళితులంటే కేసీఆర్ కు ఎంత చిన్నచూపో ఈ ఘటనతో మరోసారి బయటపడిందని దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు,ఈ ఘటనపై కేసీఆర్, కేటీఆర్ లు వెంటనే దళిత సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీఎస్సీ సెల్ జిల్లా నాయకులు నోముల ప్రవీణ్ తెలిపినారు.

