
మహబూబాబాద్ టౌన్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తూ, ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన హెడ్ కానిస్టేబుల్ (హెచ్.సి 1434) బి. లక్ష్మీపతి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం ఆయన కుటుంబానికి రూ. 30,000 తక్షణ ఆర్థిక సహాయం అందించారు. మహబూబాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ వెల్ఫేర్ నిధుల నుండి ఈ మొత్తాన్ని మృతుని కుటుంబ సభ్యులకు అందజేశారు.మహబూబాబాద్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీరాం శేఖర్ ఆధ్వర్యంలో ఈ సాయాన్ని అందించడం జరిగింది. లక్ష్మీపతి మృతి పోలీస్ శాఖకు తీరని లోటని, వారి సేవలు మరవలేనివని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ బాదే రామయ్య, ఆర్గనైజేషన్ సెక్రటరీ దిడ్డి అనిల్, ఈసీ మెంబర్ కోడిశాల సురేష్ పాల్గొన్నారు. అలాగే ఇన్చార్జి టౌన్ సీఐ అంజలి, ఎస్ఐలు ఉమ, సూరయ్య తదితర పోలీస్ అధికారులు హాజరై, మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

