పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన సాయి కుమార్ సేవలు స్ఫూర్తిదాయకం
దంతాలపల్లి, సెప్టెంబర్ 9 (నమస్తే న్యూస్):
మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో బీజేపీ కార్యకర్తగా పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన దివంగత అల్లం సాయి కుమార్ విగ్రహాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ (NCST) సభ్యులు జాటోతు హుస్సేన్ నాయక్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా సాయి కుమార్ పార్టీకి అందించిన సేవలను నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. బీజేపీ బలోపేతానికి ఆయన చేసిన కృషి, పార్టీ కోసం చూపిన అంకితభావం, త్యాగాలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ రాజ్యసభ సభ్యులు గరికిపాటి మోహన్ రావు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు, మహబూబాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షులు వల్లభు వెంకటేశ్వర్లుతో పాటు జిల్లా నాయకులు, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.సాయి కుమార్ ఆశయాలను కొనసాగిస్తూ పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఆయన సేవలను చిరస్మరణీయంగా నిలిపేలా విగ్రహాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.


