గతేడాది రిజిస్ట్రేషన్ వివరాలతో పాత అప్లికేషన్‌ను కొనసాగించే అవకాశం
నర్సింహులపేట, సెప్టెంబర్ 9 (నమస్తే న్యూస్):
గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పోలీస్ శాఖ అనుమతి పొందాలని నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న సూచించారు. గణేష్ ఉత్సవాలు–2026కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు, ఇతర వివరాల నమోదు కోసం పోలీస్ శాఖ రూపొందించిన గణేష్ అప్లికేషన్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని సూచించారు. నిర్వాహకులు తమ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి, అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.గత ఏడాది గణేష్ ఉత్సవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిర్వాహకులు తాము గతంలో నమోదు చేసిన మొబైల్ నంబర్ లేదా రిజిస్టర్డ్ ఐడీతో లాగిన్ అయితే పాత అప్లికేషన్ వివరాలు అందుబాటులోకి వస్తాయని ఎస్సై తెలిపారు. పాత దరఖాస్తులోని వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, తాజా సమాచారాన్ని నమోదు చేసి ఈ ఏడాది అప్లికేషన్‌ను కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు.గణేష్ ఉత్సవాల నిర్వాహకులు చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్సై బానోత్ వెంకన్న సూచించారు. పోలీస్ శాఖ నిబంధనలు, సూచనలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.
గణేష్ మండపాల నిర్వహణకు దరఖాస్తు తప్పనిసరి: ఎస్సై బానోత్ వెంకన్నగతేడాది రిజిస్ట్రేషన్ వివరాలతో పాత అప్లికేషన్‌ను కొనసాగించే అవకాశంనర్సింహులపేట, సెప్టెంబర్ 9 (నమస్తే న్యూస్):గణేష్ మండపాల ఏర్పాటుకు నిర్వాహకులు తప్పనిసరిగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని పోలీస్ శాఖ అనుమతి పొందాలని నర్సింహులపేట ఎస్సై బానోత్ వెంకన్న సూచించారు. గణేష్ ఉత్సవాలు–2026కు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని తెలిపారు.గణేష్ మండపాల ఏర్పాటుకు అనుమతులు, ఇతర వివరాల నమోదు కోసం పోలీస్ శాఖ రూపొందించిన గణేష్ అప్లికేషన్ పోర్టల్‌ను వినియోగించుకోవాలని సూచించారు. నిర్వాహకులు తమ మండపానికి సంబంధించిన పూర్తి వివరాలను నమోదు చేసి, అవసరమైన అనుమతుల కోసం దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు.గత ఏడాది గణేష్ ఉత్సవాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్న నిర్వాహకులు తాము గతంలో నమోదు చేసిన మొబైల్ నంబర్ లేదా రిజిస్టర్డ్ ఐడీతో లాగిన్ అయితే పాత అప్లికేషన్ వివరాలు అందుబాటులోకి వస్తాయని ఎస్సై తెలిపారు. పాత దరఖాస్తులోని వివరాలను పరిశీలించి, అవసరమైన మార్పులు, తాజా సమాచారాన్ని నమోదు చేసి ఈ ఏడాది అప్లికేషన్‌ను కొనసాగించుకోవచ్చని పేర్కొన్నారు.గణేష్ ఉత్సవాల నిర్వాహకులు చివరి నిమిషంలో ఇబ్బందులు తలెత్తకుండా ముందుగానే ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసుకోవాలని ఎస్సై బానోత్ వెంకన్న సూచించారు. పోలీస్ శాఖ నిబంధనలు, సూచనలను పాటిస్తూ గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు నిర్వాహకులు సహకరించాలని కోరారు.

