ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కి బెయిల్ మంజూరు
పిండిప్రోలు ఆనంద ఉత్సవాల్లో బిఆర్ఎస్ శ్రేణులు
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 8 (నమస్తే న్యూస్)
ఉమ్మడి ఖమ్మం జిల్లా ఎమ్మెల్సీ, మాజీ జిల్లా పార్టీ అధ్యక్షులు తాతా మధుసూదన్ కి బెయిల్ మంజూరు కావడం పట్ల బీఆర్ఎస్ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ పిండిప్రోలు బాణాసంచ కాలుస్తూ ఆనందోత్సవాల మధ్య సందడి చేశారు ఈ సందర్భంగా టిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు చామకూరి రాజ్ కుమార్ మాట్లాడుతూ . కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితంగా బనాయించిన అక్రమ కేసులో అరెస్ట్ అయిన మన ప్రియతమ నాయకులు తాతా మధుసూదన్ కి చివరకు న్యాయస్థానంలో న్యాయం జరిగిందని తిరుమలాయపాలెం మండలం బీఆర్ఎస్ మండల నాయకులు పిండిప్రోలు ఉప సర్పంచ్ చామకూరి రాజ్ కుమార్ అన్నారు. నాంపల్లి కోర్టు తాతా మధుసూదన్ కి బెయిల్ మంజూరు చేయడం న్యాయంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచిందని ఆయన పేర్కొన్నారు.ప్రజా సమస్యలపై అసెంబ్లీలో ప్రశ్నించినందుకు, ప్రజల తరఫున నిరంతరం పోరాడుతున్న నాయకులను రాజకీయ కక్షతో లక్ష్యంగా చేసుకుని తప్పుడు కేసులు బనాయించి అక్రమంగా అరెస్ట్ చేయించడం కాంగ్రెస్ ప్రభుత్వ నియంతృత్వ వైఖరికి నిదర్శనమని చామకూరి రాజు మండిపడ్డారు.పిండిప్రోలు గ్రామ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్ష కార్యదర్శులు పరికపల్లి చంద్రశేఖర్ పసలాది ముత్తయ్య టిఆర్ఎస్ యూత్ లీడర్ చామకూరి శరత్ నాతి సత్యనారాయణ చామకూరి వెంకన్న తాత రవీందర్ యనగందుల సత్యనారాయణ తాత మనోజ్ గోకినపల్లి ఉపేందర్ చామకూరి రాంబాబు ఐల పొంగు వెంకన్న రేపాకులో ఉపేందర్ రేపాగుల రవి గజ్జల వీరేందర్ చామకుర్తి కృష్ణయ్య పరికపల్లి వెంకటేశ్వర్లు పులిగుజ్జు శ్రీను చామకూరి కిరణ్ గోపోజి నాగరాజు పూజల నరసింహారావు పప్పుల బంటి ధనియాకుల కార్తిక్ తదితరులు పాల్గొన్నారు

