దళిత స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తాత మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి
కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్,
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 8 (నమస్తే న్యూస్ )
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్, దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎమ్మెల్సీ తాత మధుపై కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత మధుపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని, ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు కొప్పుల అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం ఆయన స్వగ్రామమైన పిండిప్రోలులో ఖమ్మం–వరంగల్ జాతీయ రహదారిపై భారీ రాస్తారోకో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాలేరు ఆత్మ కమిటీ చైర్మన్ చావా శివరామకృష్ణ హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత గౌరవప్రదమైన స్థానంలో ఉన్న శాసనసభ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.దళిత స్పీకర్‌ను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రతి ఒక్కరి గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత ఉందని, అలాంటి వ్యక్తి నుంచి అనుచిత వ్యాఖ్యలు రావడం తీవ్రంగా ఖండించాల్సిన విషయమని పేర్కొన్నారు.తాత మధుపై ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఆయనను ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అలాగే తాత మధు చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు తాత మధు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు.
దళితుల ఆత్మగౌరవాన్ని కించపరిచే వ్యాఖ్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని, రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని కొనసాగిస్తామని కాంగ్రెస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ రాస్తారోకోతో జాతీయ రహదారిపై గంట సేపు వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి ఉన్నం రాజశేఖర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దూదిమెట్ల వెంకట్ పొట్ల కిరణ్ గుగ్గిళ్ల అంబేద్కర్ అనపర్తి రవి అనపర్తి రమేష్ , కట్కూరు శ్రీనివాసరెడ్డి బానోతు సిమ్లా నాయక్ నాగయ్య నంద్యాల శ్యాంసుందర్ రెడ్డి పత్తి నాగేశ్వరరావు దుబాకుల పిచ్చయ్య చుంచు కోటయ్య సంజీవరెడ్డి షేక్ షకీల్ పాషా నల్లబెల్లి లింగయ్య గొల్ల లింగయ్య గుగ్గులోతు వీరన్న చీమల నాయక్ మెట్టు రవి మాగి బాలకృష్ణ సైఫుద్దీన్ గుమ్మడి దేవా బిక్షం బోడ విజయ చంద్రన్ బాలాజీ నగేష్ గౌడ్ వీరదాసు వినోద కుంభ ఉపేందర్ కుంభం ఉపేందర్ రామిరెడ్డి బండమీది సాయి బుర్ర శ్రీనివాస్ లింగంపల్లి సురేష్ ఉండేటి ధర్మరాజు వరిగడ్డి సాగరు ధరావతు నరసింహారావు మాచర్ల నాగరాజు బానోత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు.

