వ్యవసాయ బావుల్లో బోర్లలో అడుగంటిన గ్రౌండ్ వాటర్.
( ఏఐపీకేఎంఎస్ )జిల్లా కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు
బచ్చోడు సబ్ స్టేషన్ ముందు మాస్ లైన్ ధర్నా.
తిరుమలాయపాలెం సెప్టెంబర్ 8( నమస్తే న్యూస్)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని గుర్తు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఉదయం 5 గంటలకు రావాల్సిన త్రీఫేస్ కరెంటు ఉదయం 8 గంటల అయినా వచ్చే పరిస్థితి లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఈ సంవత్సరం ఎనీనో వర్ష బావ
పరిస్థితి వల్ల వర్షాలు రాక రైతాంగం చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఒకనాడు నారా చంద్రబాబు నాయుడు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోండని రైతులు ను హరివాస పెట్టిన చంద్రబాబు నాయుడు కరెంటు ఉద్యమంలో ముగ్గురు వీరులు మరణించిన పరిస్థితి రాష్ట్రంలో ఉన్నది. అప్పటి ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి రైతు ల కు ఉచిత కరెంటు ఇచ్చి కొంత ఉపశమనం కలిగించి నాడు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు 24 గంటల కరెంటు ఇచ్చి రైతులని రారాజు చేసిన పరిస్థితి ఉన్నది.
2023లో కాంగ్రెస్ తెలంగాణలో అధికారం వచ్చినాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకొని రైతులని అరిగోస పెడుతున్న పరిస్థితి ప్రస్తుతం కొనసాగుతుందని సిపిఐ( ఎంఎల్) మాస్ లైన్ (ప్రజాపంథా ) అనుబంధ అఖిలభారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం( ఏఐపీకే ఎంఎస్) ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి తిమ్మిడి హనుమంతరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శించారు.
ఈరోజు బచ్చోడు గ్రామంలో ఉదయం 5 గంటల నుండి 8 గంటల వరకు త్రీఫేస్ కరెంట్ కోసం రైతులు వేచి ఉన్నా కూడా మెసేజ్ రావట్లేదు త్రీ ఫేస్ కరెంటు రావట్లేదని రైతులు ఆందోళన చెందిన కరెంట్ అధికారుల్లో మానవత్వం లేని పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సమయపాలన పాటించి రైతులకు త్రీఫేస్ కరెంటు ఇవ్వాలని హనుమంతరావు డిమాండ్ చేశారు.
ఇట్లాగే పరిస్థితి కొనసాగితే రేపు రాబోవు రోజుల్లో సిపిఐ (ఎంఎల్ )మాస్ లైన్ (ప్రజాపంథా) ప్రజా పోరాటాలు ఉదృతం చేయాల్సిన పరిస్థితి ఉంటుందని తిమ్మిడి హనుమంతరావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో భూక్య రాంబాబు. రమేష్. దోతి సైదులు. బాలాజీ. గురువయ్య. ధరావ త్ తావూరియా. సక్రాం. బాలు తదితరులు పాల్గొన్నారు

