నర్సింహులపేట, సెప్టెంబర్ 9(నమస్తే న్యూస్)
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రానికి చెందిన సూరబోయిన చంద్రమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచ్ పెద్దమాముల యాకన్న, గ్రామ ఉపసర్పంచ్ కాస యాకయ్య, కాంగ్రెస్ పార్టీ మాజీ మండలాధ్యక్షుడు జినుకల రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు రఘు రెడ్డి, డోర్నకల్ నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రేఖ అనిల్ యాదవ్, గ్రామ యూత్ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ యాదవ్, మండల యూత్ అధ్యక్షుడు పొన్నం శ్రీకాంత్, జిల్లా నాయకులు అలవాల శ్రీనివాస్ తదితరులు పరామర్శించారు. అనంతరం ఈ సందర్భంగా చంద్రమ్మ కుటుంబ సభ్యులకు రూ.5,000 ఆర్థిక సహాయం అందజేసి, కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. చంద్రమ్మ మృతికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏర్రనాగి వెంకన్న, శేరి గోపి, మున్వర్, లెక్కల సంపత్ రెడ్డి, జంపాల శ్రీకాంత్, మామిడి శెట్టి యాకన్న, ఎర్ర రవి, భరత్ తదితరులు పాల్గొన్నారు.

