తిరుమలాయపాలెం సెప్టెంబర్ 8
(నమస్తే న్యూస్ )
తిరుమలాయపాలెం మండలం లో వినాయక చవితి సందర్భంగా గణేష్ మండపాలు ఏర్పాటు చేసే భక్తులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని ఎస్ఐ జగదీష్ సూచించారు. మండపాల నిర్వహణకు సంబంధించిన అనుమతుల కోసం ప్రభుత్వం సూచించిన విధంగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. మండపాల నిర్వాహకులు ముందుగానే అనుమతులు పొందాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా పోలీసులకు సహకరించాలని తిరుమలాయపాలెం ఎస్సై కూచిపూడి జగదీష్ కోరారు.

