హైదరాబాద్: తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం మహబూబాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా గండి సాయి బాబు గౌడ్ నియమితులయ్యారఈ సందర్భంగా ఈరోజు హైదరాబాద్లోని తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం కేంద్ర కార్యాలయంలో వ్యవస్థాపక అధ్యక్షులు గట్టు రామచంద్రయ్యా గౌడ్ గారి చేతుల మీదుగా గండి సాయి బాబు గౌడ్ నియామక పత్రాన్ని అందుకున్నారు.నియామక పత్రం అందుకున్న అనంతరం గండి సాయి బాబు గౌడ్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, గౌడ జాతి అభ్యున్నతి, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. గౌడ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని పేర్కొన్నారు.అలాగే గౌడ యువతకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, సామాజికంగా మరియు ఆర్థికంగా గౌడ సమాజం అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని సాయి బాబు గౌడ్ తెలిపారు.తనకు జిల్లా ఉపాధ్యక్ష బాధ్యతలు అప్పగించిన తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం వ్యవస్థాపకులు గట్టు రామచంద్రయ్య గౌడ్ గారికి మరియు రాష్ట్ర అధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్, యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోల్కాపురి శ్రీకాంత్ గౌడ్ గార్లకు మరియు జిల్లా అధ్యక్షులు గండి వీరేందర్ గౌడ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

